మార్పులు తీసుకొచ్చేందుకు మూసీ ప్రక్షాళన

ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

Update: 2024-11-23 11:43 GMT

దిశ,నకిరేకల్: ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మూసీ ప్రాజెక్టులో 9 లక్షల చేప పిల్లలను శనివారం విడుదల చేశారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని జీర్ణించుకోలేకనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. మూసీ నీటిలో భయంకరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయని తేలిందని, ఆ నీటిని ప్రక్షాళన ద్వారానే పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళన చేసి గతంలో మాదిరిగానే ఆ నీటిని ప్రజలు తాగే విధంగా చేస్తామన్నారు. 


Similar News