మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులకు ఎస్టీల కోసం ఆలోచించే సోయి లేదని ఎస్టీల కోసం ఆలోచించిన వ్యక్తి కేవలం సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
దిశ, మేళ్లచెరువు : మాటల్లో కాదు గెలుపు అనేది చేతల్లో చూపించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మేళ్లచెరువులోని కస్తూరి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మేళ్ల చెరువు మండల కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తలు బూతు స్థాయి నాయకుల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్నగర్ ఎమ్మెల్యేలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాటలతో కాదు చేత లో చేసి చూపి 50 వేల మెజార్టీ తగ్గకుండా పనిచేయాలని కోరారు. తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదో ఒక పదవిలో ఉంటానని అన్నారు. 25 రోజుల పాటు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచనలు చేశారు.
హుజూర్ నగర్ లలో 50 వేల మెజార్టీ రావడం ఖాయం అని స్పష్టం చేశారు. వందల సంవత్సరాలు ఉండాల్సిన కాళేశ్వరం, మేడి గడ్డ ప్రాజెక్టు లు ఐదు సంవత్సరాలకే కూలి పోయినాయని లక్ష కోట్ల నష్టం జరిగిందని అన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎకరానికి చుక్కనీరు కూడా రాలేదని అన్నారు. కేసీఆర్ సీఎం స్థానం లో ఉండి అబద్ధాలు చెప్పడం వారి ఓటమికి నిదర్శనం అని అన్నారు. నవంబర్ 3 లోపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు విడుదల చేయాలని 20 రోజుల క్రితం చెబితే బీఆర్ఎస్ నాయకులు రైతు బంధు నిలుపుదల చేయమని ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారని తప్పుడు ఆరోపణలు చేశారనీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు గ్యారెంటీలు, స్టిక్కర్స్, కరపత్రాలు, ప్రతి ఇంటికి చేరాలని కార్యకర్తలుకు నాయకులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకునూరి భాస్కర్ రెడ్డి, శెట్టి రామచంద్రరావు, సైడేశ్వరరావు, మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.