భక్తిశ్రద్ధలతో ధనుర్మాస ఉత్సవాలు
జాజిరెడ్డిగూడెంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు గత 13 రోజులుగా భక్తిశ్రద్ధలు,నియమ నిష్ఠలతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని ఆలయ వంశపారంపర్య అర్చకులు అర్వపల్లి రాంబాబు,పవన్ కుమార్ తెలిపారు.
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): జాజిరెడ్డిగూడెంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు గత 13 రోజులుగా భక్తిశ్రద్ధలు,నియమ నిష్ఠలతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని ఆలయ వంశపారంపర్య అర్చకులు అర్వపల్లి రాంబాబు,పవన్ కుమార్ తెలిపారు. విశేష పూజలు, సాయంకాల సమయంలో కుంకుమార్చనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గుడిపల్లి సులోచన, సదాలక్ష్మి,విజయ,లలిత, విజయలక్ష్మి,యాదమ్మ,జానకమ్మ,పద్మ, దాసరి సోమయ్య,శిగ రవి,నిరంజన్,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.