పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలం : చలమల్ల కృష్ణారెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు.

Update: 2023-08-20 15:16 GMT

దిశ, చండూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్య, గట్టుపల్, శేరిగూడెం, తెరట్ పల్లి, నామాపురం గ్రామాలలో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షలు రైతు ఋణమాపి, ఐదువందల కే వంటగ్యాస్ సిలిండర్, నాలుగు వేల పింఛన్, రైతుబందు పదిహేను వేలు వంటి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిది ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అప్పులు, అవినీతి పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నరు. పథకాలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ఇతర రాష్ట్రాలలో ఖర్చు చేస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్దిచెపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరవేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ఈ యాత్రలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చేరుపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రావుల రమేష్, గట్టుప్పల గ్రామ శాఖ అధ్యక్షుడు సామల యాదయ్య, ఆది, బిమగాని మల్లేష్, కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.

Tags:    

Similar News