ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉంటా.. పూస బాలకిషన్

మండలంలోని ఇంద్రపాలనగరంలో గల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉంటానని కాంగ్రెస్ జిల్లా నాయకులు పూస బాలకిషన్ అన్నారు.

Update: 2024-10-20 05:50 GMT

దిశ, రామన్నపేట : మండలంలోని ఇంద్రపాలనగరంలో గల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉంటానని కాంగ్రెస్ జిల్లా నాయకులు పూస బాలకిషన్ అన్నారు. గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న దట్టమైన ముళ్ళపొదలలను, పిచ్చి మొక్కలను తన సొంత నిధులతో జేసీబీ, డోజర్ ల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా పూస బాలకిషన్ మాట్లాడుతూ.. పిచ్చి మొక్కలు, ముళ్ళపొదలు ఉండడం వల్ల పాఠశాలలోకి విషసర్పాలు, తేల్లు రావడంతో విద్యార్థులు భయాందోళన గురవుతున్నారని అన్నారు.

విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు విద్య పై ఆధారపడి ఉంటుందని, విద్యకు ఆటంకం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ గర్దాసు సురేష్, బంధారపు వెంకటేష్, రాచకొండ అంజయ్య, కాంబాలపల్లి శ్రీశైలం, కోడారి వెంకటేష్, మేకల నరేష్, ఉల్లె కృష్ణ, పంగా స్వామీ, రుద్రాల విక్కీ, ఉల్లే నరేష్, పబ్బు మచెందర్, జ్ఞానేశ్వర్, మధు, మల్లేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Similar News