వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. మాజీ మంత్రి..

కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-20 07:36 GMT

దిశ, సూర్యాపేట, టౌన్ : కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఆదివారం రాంరెడ్డి వరూధినీ దేవి జ్ఞాపకార్ధం లయన్స్ కంటి ఆసుపత్రి సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా కందగట్ల గ్రామంలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఆపరేషన్లు చేశామని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు వేల రూపాయలు డబ్బులు వెచ్చించి వైద్యం చేసుకోకుండా లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత సేవలు చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణు రెడ్డి, సూర్యాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు, సూర్యాపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాసరబాద గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Similar News