బస్సును ఢీ కొట్టిన డీసీఎం... 14 ఆవులు మృతి..

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న బస్సును డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టింది.

Update: 2024-10-20 07:12 GMT

దిశ, నార్కట్ పల్లి : హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న బస్సును డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 14 ఆవులు మృతి చెందాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా సంత నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గోవులను కబేలాకు తరలిస్తున్నారు. నార్కట్ పల్లి శివారులో ఓ హోటల్ వద్ద తెల్లవారుజామున అదే మార్గంలో వస్తున్నటువంటి డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 30కి పైగా ఆవులలో 14 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని ఆవులను చికిత్స నిమిత్తం తరలించగా, మరికొన్ని ఆవులను నల్లగొండలోని గో సంరక్షణ సమితికి తరలించారు.

హోటల్ వద్ద వాహనాలను నిలిపివేయడంతో తరచుగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నిత్యం ఈ జాతీయ రహదారి పై అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాలు వెళుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదనే చెప్పొచ్చు. ఓకే డీసీఎంలో 30కి పైగా ఆవులను తరలిస్తూ రాత్రి సమయంలోనే ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిద్రాహారాలు మాని వాహనాలను వేగంగా నడపడం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్రమ గోవుల తరలింపు పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే దేవాలయాల పై జరుగుతున్న దాడులు, గోవుల తరలింపులు వీటి పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News