రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : ఎమ్మెల్యే
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అనంతారం గ్రామంలో ఆదివారం మెప్మా ఆధ్వర్యంలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు
దిశ ,తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అనంతారం గ్రామంలో ఆదివారం మెప్మా ఆధ్వర్యంలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనసును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని,రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. దళారుల చేతుల్లో మోసపోవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు,కౌన్సిలర్లు వై నరేష్,పత్తెపురం సరిత,బత్తుల శ్రీను,కుదురుపాక శ్రీలత,మెప్మా మండల అధికారి రేణుక,కాంగ్రెస్ జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్,మాజీ ఎంపీటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిలాల్,మున్సిపల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పేరాల వీరేష్, సుధాకర్,కన్నెబోయిన లక్ష్మయ్య,హమాలీలు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.