విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసి ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కాన్వాయిస్ లో రోడ్డు మార్గం
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కాన్వాయిస్ లో రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి కొండపైకి చేరుకున్నారు. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసి, ఎలక్ట్రికల్ వాహనం ద్వారా అఖండ దీపారాధన వద్దకు చేరుకున్నారు. ఎక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి టెంకాయ సమర్పించారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆయన మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అంతరాలయములోని స్వయంభువులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఉత్తర రాజగోపురం నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి తిరిగి రోడ్డు మార్గం ద్వారా ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై వైటిడిఏ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.