చౌటపల్లి ఊర చెరువు ఆక్రమణ.. మంత్రి ఉత్తమ్, జిల్లా కలెక్టర్ స్పందించాలని వినతి

ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు

Update: 2024-11-14 11:40 GMT

దిశ,మఠంపల్లి : ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా గ్రామాల్లో మాత్రం రైతులకు ఉపయోగపడే చెరువులు మాత్రం ఆక్రమణకు గురవుతున్నాయి.మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఊరచెరువు అందజా 50ఎకరాలు ఆక్రమణకు గురి ఐనది, సర్వే నెంబర్ 6లో 20 ఇరవై ఎకరాలు, ఎఫ్ టి ఎల్ 574 సర్వే నెంబర్ లో 30 ఎకరాలు ఆక్రమణకు గురి కాగా 25 ఎకరాల్లో ఆక్రమణ దారులు సేద్యం చేస్తున్నారు. గత నెలలో హుజుర్ నగర్ ఆర్ డి ఓ కు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది.

విషయం పై స్పందించిన ఆర్ డి ఓ డివిజనల్ సర్వేయర్ ను పంపించగ హద్దు రాళ్లు కనిపించడం లేదని చెప్పి వెనుదిరిగి వెళ్లడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని వెంటనే జిల్లా స్థాయి సర్వేయర్ తో సెర్వే చేయించి ఆక్రమణకు గురి అయిన భూమిని కాపాడాలని ఆయకట్టు రైతులు కంచాల శ్రీనివాస్ రెడ్డి, మద్ది హుస్సేన్ రెడ్డి, వీరంరెడ్డి వీరారెడ్డి, తమ్మర శ్రీనివాస్ రెడ్డి, కొండేటి రామ నర్సిరెడ్డి, గుండె పొంగు చిన సైదులు, పెద సైదులు, కొమ్ము బాలకోటయ్య, గుండె పంగు స్వామి, యస్ కే సర్దార్ తదితరులు ప్రభుత్వ అధికారులను కోరారు.


Similar News