చైనా మాంజా వాడకం నిషేధం

రాబోయే సంక్రాంతి సందర్భంగా జిల్లాలో చిన్నపిల్లలు, పెద్దలు సరదా కోసం ఎగరవేసే పతంగులకు నైలాన్, సింథటిక్ తో తయారు చేసినా చైనా మంజా వాడటం నిషేధమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2025-01-07 12:31 GMT

దిశ, నల్లగొండ క్రైం: రాబోయే సంక్రాంతి సందర్భంగా జిల్లాలో చిన్నపిల్లలు, పెద్దలు సరదా కోసం ఎగరవేసే పతంగులకు నైలాన్, సింథటిక్ తో తయారు చేసినా చైనా మంజా వాడటం నిషేధమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో చైనా మాంజా విక్రయాలు, వినియోగాల పైన ప్రత్యేక దృష్టి పెట్టారని, ఎవరైనా నిలువ ఉంచిన, తయారుచేసినా, అమ్మడానికి ఎవ్వరైనా ప్రోత్సహించినా, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైనా మాంజను పతంగులకు వాడి బయట పడేసినట్లయితే అవి చెట్లకు, ఎలక్ట్రిక్ తీగలకు తగిలి వేలాడి ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ మాంజా తగిలి కొన్ని ప్రాంతాలలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. చైనా మంజా నిలువచేసినా, అమ్మినా, వాడినా డయల్ 100కు, సమీప పోలీస్ స్టేషన్ కు కానీ సమాచారం అందించాలని సూచించారు.


Similar News