కారెక్కిన కమలనాథులు..
కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
దిశ : దేవరకొండ, కొండమల్లేపల్లి : కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు లింగంతో పాటు, బీజేపీకి చెందిన 30 మంది యువకులు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులైన నాయకులు, యువకులు, కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పదంలో నడవాలంటే తెలంగాణకు సపోర్టుగా యువత ముందుండాలనే ఉద్దేశంతోనే వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు.
అంతే కాకుండా ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే తట్టు కోలేకపోతున్నాయని ఆయన అన్నారు. దేశంలో రాబోయే రోజుల్లో గుణాత్మక మార్పులకు బీఆర్ఎస్ పార్టీ నాందిపలుకుతుందని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు రాజేష్, నాయకులు సురేష్, శ్రీను, జానీ, జానయ్య, మణికంఠ, దేవేందర్, సురేష్, మల్లేష్, జనార్దన్, బాబా, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కొండమల్లేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రామావత్ దస్రు నాయక్, జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగంధర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, వస్కుల కాశయ్య, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.