బడ్జెట్ లో భువనగిరి సాగినీటి కాలువలకు ప్రాధాన్యత

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో భువనగిరి సాగునీటి కాల్వలైన భునాది గాని,భీమ లింగం,ధర్మారెడ్డి పల్లి కాలువల మరమ్మతుకు 265 కోట్లు కేటాయించడం హర్షించ దగ్గ విషయమని భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2025-03-20 14:18 GMT
బడ్జెట్ లో భువనగిరి సాగినీటి కాలువలకు ప్రాధాన్యత
  • whatsapp icon

దిశ ,వలిగొండ:

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో భువనగిరి సాగునీటి కాల్వలైన భునాది గాని,భీమ లింగం,ధర్మారెడ్డి పల్లి కాలువల మరమ్మతుకు 265 కోట్లు కేటాయించడం హర్షించ దగ్గ విషయమని భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంజూరు అయిన 72 చెక్కులను లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్ల కల సహకారం చేసిండని, మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటం ఫలితాన్ని అందించాడని అన్నారు. బీసీ కుల గణన తో 42 శాతం రిజర్వేషన్ తో బీసీల బతుకులు మారబోతున్నాయని అన్నారు. భువనగిరి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ముఖ్యంగా వేసవిలో త్రాగునీటి, కరెంటు సమస్యలు తలెత్తకుండా అధికారుల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పి.శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీవో జితేందర్ రెడ్డి,ఎంపీఓ కేదారేశ్వర్, ఆర్ ఐ లు కరుణాకర్ రెడ్డి,మనోహర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, మత్స్యగిరి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు కుంభం వెంకట పాపిరెడ్డి, బాతరాజు ఉమా బాల నరసింహ,నాయకులు గరిసె రవి, బెలిదే నాగేశ్వర్,ఉలిపే మల్లేశం, బత్తిని సహదేవ్, గుర్రం లక్ష్మారెడ్డి, నోముల మల్లేశం, కొండూరు భాస్కర్, సాయి, కాసుల వెంకన్న,మామిడి సత్తిరెడ్డి, మామిడి నరేందర్ రెడ్డి, ఇక్కుర్తి స్వామి, తదితరులు పాల్గొన్నారు.


Similar News