దిశ ఎఫెక్ట్.. జలాల్‌పుర్ చెరువు కట్టపై బారికేడ్ల ఏర్పాటు
దిశ కథనానికి స్పందించిన అధికారులు చెరువు కట్టపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. వి
దిశ, భూదాన్ పోచంపల్లి: దిశ కథనానికి స్పందించిన అధికారులు చెరువు కట్టపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో గల చెరువు కట్టపై ఉన్న మూలమలుపు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల హైదరాబాద్ నుండి పోచంపల్లికి కారులో వస్తున్న ఐదుగురు యువకులు జలాల్పురం చెరువు కట్టపై ఉన్న మూలమలుపు కనిపించకపోవడంతో అదుపుతప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో "మృత్యువుగా మారుతున్న మూలమలుపు" అనే కథనం ఈ నెల 11న దిశ దినపత్రికలో ప్రచురితమైంది. వెంటనే అధికారులు స్పందించి చెరువు కట్ట మూలమలుపు వద్ద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. దిశ దినపత్రిక చొరవతో బారికేడ్లను ఏర్పాటు చేసినందుకుగాను పలువురు కృతజ్ఞతలు తెలిపారు.