Yadagiri Gutta: యాదగిరి గుట్టలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

ఈ రోజు నుంచి ధనుర్మాస(Dhanurmasa) ఘడియలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ ఆలయాలకు ఉత్సవ శోభ రానుంది.

Update: 2024-12-16 03:51 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు నుంచి ధనుర్మాస(Dhanurmasa) ఘడియలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ ఆలయాలకు ఉత్సవ శోభ రానుంది. దేవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలను (Dhanurmasa festivals) వైభోవేపేతంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో (Sri Lakshminarasimha Swamy temple)కూడా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో యాదగిరి గుట్ట ఆలయం నందు ఈరోజు ఉదయం నుండి ధనుర్మాస ఉత్సవములు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ వేడుకలను డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు 30 రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించబడతాయని వివరించారు. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు తిరుప్పావై కార్యక్రమం (Thiruppavai program) నిర్వహించబడునని తెలిపారు. ఇక జనవరి 13 న గోదా కళ్యాణం(Goda Kalyanam), 14 న ఒడిబియ్యం కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News