Alwal: ఇందిరానగర్ లో యువకుడి దారుణ హత్య

కానాజీగూడ(Kanaji Guda) ఇందిరానగర్(Indira Nagar) లో ఓ యువకుడు దారుణ హత్యకు(Murder) గురైన సంఘటన ఆదివారం అల్వాల్ పోలీస్ స్టేషన్(Alwal Police Station) పరిధిలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది.

Update: 2024-12-16 06:24 GMT

దిశ, అల్వాల్: కానాజీగూడ(Kanaji Guda) ఇందిరానగర్(Indira Nagar) లో ఓ యువకుడు దారుణ హత్యకు(Murder) గురైన సంఘటన ఆదివారం అల్వాల్ పోలీస్ స్టేషన్(Alwal Police Station) పరిధిలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంజాయి మత్తుకు అలవాటు పడిన యుకుల మధ్య పాత గొడవలు ఉన్నట్లు తెలియవచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకుని ఆదివారం రాత్రి సందిల్ (23) ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు ఇంట్లోకి చొరపడి కత్తులతో దాడిచేసి దారుణంగా పొడవడంతో తీవ్రగాయాలపాలైన సందిల్ ను బంధువులు గాంధీ హాస్పటల్(Gandhi Hospital) కు తరలించగా చికిత్స పొందుతూ సోమారం తెల్లవారు జామున మృతి చెందాడు. సంఘటన స్థానికి చేరుకున్న పోలీసులు ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ ఆధ్వర్యంలో హత్యజరిగిన తీరును పరిశీలించారు.మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించామని ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Tags:    

Similar News