గురుకులలో ఎలుకల స్వైర విహారం..ఐదుగురు విద్యార్థులపై దాడి
కీసర మహాత్మా జ్యోతిబాపూలే గర్ల్స్ హాస్టల్ లో ఎలుకలు
దిశ,మేడ్చల్ బ్యూరో : కీసర మహాత్మా జ్యోతిబాపూలే గర్ల్స్ హాస్టల్ లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.విద్యార్థులు రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు విద్యార్థులను కరిశాయి. గుట్టు చప్పుడు కాకుండా కీసర ప్రభుత్వ దావఖనలో విద్యార్థులకు వైద్యం అందించారు. హాస్టల్ సిబ్బంది, విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ ప్రిన్సిపల్ , అధ్యాపకులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపల్ విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుతున్నారని పలువురు విద్యార్థి,సంఘాల, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.వివరాల్లోకి వెళ్లితే...కీసర గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఆదివారం అర్ధరాత్రి ఎలుకలు కరిశాయి.సమాచారం అందుకున్న హాస్టల్ సిబ్బంది,ప్రిన్సిపాల్ మహాలక్ష్మి విద్యార్థులను కీసర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు... Keesara Mahatma Jyotibapoole , Rats, Rampage , Girls Hostel , Rats bit , Students , Telangana , Latest News
దద్దుర్లు వచ్చాయి : మహాలక్ష్మి
విద్యార్థులకు దద్దుర్లు , దురదలు వచ్చాయని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి తెలిపారు.ఎలుకలు కరిశాయి అనడంలో నిజం లేదన్నారు.తప్పుడు ప్రచారం నమ్మద్దని తెలిపారు..
ఎలుకలు కరిశాయి : డాక్టర్ సౌందర్య
గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఎలుకలు కరిచినట్లు కీసర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సౌందర్య అన్నారు.ఐదుగురు విద్యార్థులకు ఎలుకలు కరిచినందుకు చికిత్స చేసినట్లు చెప్పారు.