Assembly: తీవ్ర ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పీవైఎల్
తెలంగాణ శాసన సభ సమావేశాలు(Telangana Assembly Sessions) జరుగుతున్న వెళ అసెంబ్లీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత(High Tension) చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ శాసన సభ సమావేశాలు(Telangana Assembly Sessions) జరుగుతున్న వెళ అసెంబ్లీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత(High Tension) చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రగతి శీల యువజన సంఘం(Pragathi Sheela Yuvajana Sangam) ఆధ్వర్యంలోని విద్యార్థి నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీపై(Jobs Recruitment) ప్రభుత్వం శ్వేత పత్రం(White Paper) విడుదల చేయాలని, మద్యం, డ్రగ్స్ ను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేస్తూ.. అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం ఎదురైంది. అనంతరం పోలీసులు ఆందోళన చేస్తున్న పీవైఎల్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.