సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ..
మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) భేటీ కానున్నట్లు తెలుస్తోంది. విజయాడలోని రాష్ట్ర సచివాలయం(Secretariat)లోని బ్లాక్-1లో సీఎం, డిప్యూటీ సీఎం కలిసేందుకు ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పర్యటన(Polavaram project tour)లో ఉన్నారు. అక్కడ నుంచి రాగానే పవన్ కల్యాణ్ తో చంద్రబాబు.. ఎమ్మెల్సీలు, మంత్రుల శాఖలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా కొద్ది రోజుల క్రితమే మెగా బ్రదర్, జనసేన కార్యదర్శి నాగబాబు(Naga Babu)కు మంత్రి పదవిపై చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే నాగబాబును రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవాలని జనసేన కొరగా.. ప్రస్తుతానికి రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకొని 2027 లో రాజ్యసభకు పంపేందుకు టీడీపీ అంగీకరించింది. దీంతో నేడు రాష్ట్ర సచివాలయంలో పవన్, చంద్రబాబు నాయుడు భేటిలో నాగబాబుకు ఇచ్చే మంత్రిత్వ శాఖ పై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా బ్రదర్ నాగబాబుకు ఏ మంత్రిత్వ శాఖ వస్తుందోనని ఉత్కంఠ(excitement) జనసైనికుల్లో నెలకొంది.