TG Assembly: పెండింగ్ బిల్లులు మాకు వారసత్వంగా బీఆర్ఎస్ ఇచ్చింది.. అసెంబ్లీలో సీతక్క ఫైర్
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల పదవీకాలం అయిపోయిందని మంత్రి సీతక్క వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచుల పదవీకాలం అయిపోయిందని మంత్రి సీతక్క (Minister Seethakka) వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి రిజర్వేషన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయనేది వాస్తవమన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆమె సభలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులు మాకు వారసత్వంగా ఇచ్చారని విమర్శించారు.
ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఒక్క సంతకం పెట్టుంటే అన్ని క్లియర్ అయ్యేది అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ (BRS) అంటే బకాయిల రాష్ట్ర సమితి అని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు కోసం రూ.740 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ కింద రూ.450 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. కొంత పెండింగ్ ఉన్నది వాస్తవమని, బీఆర్ఎస్ హాయంలో ఉన్న పెండింగ్‌లు దాదాపు పూర్తి చేశామని తెలిపారు.