సార్..మాకు న్యాయం చేయండి
చివ్వెంల తహశీల్దార్ గా పని చేసిన తహశిల్దార్ పులి సైదులు తన భూమిని ఇతరులకు పట్టా చేశారని రైతు బిందాస్ తెలిపారు.
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : చివ్వెంల తహశీల్దార్ గా పని చేసిన తహశిల్దార్ పులి సైదులు తన భూమిని ఇతరులకు పట్టా చేశారని రైతు బిందాస్ తెలిపారు. తహసీల్దార్ పులి సైదులుపై ఎస్సీ,ఎస్టీ యాక్ట్, క్రిమినల్ కేసు , నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సోమవారం ప్రజా వాణిలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతు మాట్లాడుతూ..చివ్వేంల మండలంలోని వల్లభపురం రెవిన్యూ శివారులో సర్వే నెంబర్ 214/ఇ/2, విస్తీర్ణము ఎ.1-20 గుంటల భూమి ఉందన్నారు. 2007 నుంచి 2020 వరకు నేను అన్ని రకాల రికార్డులలో నమోదై ఉన్నానని తెలిపారు. అయితే తనకు తెలియకుండా 2020 ఫిబ్రవరి 4 ఎమ్మార్వో అవినీతికి పాలుపడి తారుమారు చేశారని తెలిపారు. విచారణ జరిపి భూమిని తన పేరున తిరిగి పట్టా చేయించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.