విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

బాలల హక్కుల పరిరక్షణ కోసం మండల లీగల్ సర్వీస్ అథారిటీ అందుబాటులో ఉంటుందని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహతి వైష్ణవి అన్నారు

Update: 2024-11-13 13:40 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్: బాలల హక్కుల పరిరక్షణ కోసం మండల లీగల్ సర్వీస్ అథారిటీ అందుబాటులో ఉంటుందని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహతి వైష్ణవి అన్నారు. చౌటుప్పల్ లోని బాలికల గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని..మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహతి వైష్ణవి మాట్లాడతూ..విద్యార్థి దశ నుంచే చట్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ఈ తరం బాలికలు ఈ సమాజం పట్ల అవగాహనతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధినులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు తాడురి పరమేష్, కార్యదర్శి రాపోలు వేణు, సహాయ కార్యదర్శి జల్లా రమేష్, సభ్యులు జక్కర్తి శేఖర్, న్యాయవాదులు ఎలమోని శ్రీనివాస్, తడక మోహన్, బాల్యం వెంకటాచలపతి, ఎండి. ఖయ్యాం పాషా, జంగయ్య, సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.బాలల హక్కుల పరిరక్షణ కోసం మండల లీగల్ సర్వీస్ అథారిటీ అందుబాటులో ఉంటుందని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహతి వైష్ణవి అన్నారు


Similar News