యాదాద్రి ఆలయ ఈవోగా భాస్కర్ రావు నియామకం
యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావు పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావు పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్ల వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టారు. దీంతో ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం నెలకొంది. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని... తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు. అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవో పై చర్యలు తీసుకున్నారు. అయితే భాస్కరరావును యాదాద్రి ఆలయ ఈవోగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.