నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : చెవిటి వెంకన్న యాదవ్.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.
దిశ,సూర్యాపేట ప్రతినిధి : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రo లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేoడోవసారి డీసీసీ అధ్యక్షుడిగా చెవిటి వెంకన్న యాదవ్ ఎన్నికైనందున ఆ పార్టీ కార్యకర్తలు ఘన సన్మానం నిర్వహించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ మంగళవారం రాత్రి ఉత్తర్వు లు జారీ చేశారు.ఈ సందర్భంగా చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సేవలను మరింత మెరుగు పరుస్తానని పేర్కొన్నారు.
చెవిటి వెంకన్న స్వస్థలం తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని గుమ్మడవెల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయం లో 2018 సంవత్సరంలో మొదటిసారి సూర్యా పేట జిల్లా అధ్యక్షుడిగా చెవిటి వెంకన్న యాదవ్ నియమితులయ్యారు. నాటి నుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు జిల్లాలో పోరాటాలు చేస్తున్నారు. వెంకన్న యాదవ్ నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ కార్యకర్తలు వెంకన్న యాదవ్ ని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరుపేరునా వెంకన్న యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, కౌన్సిలర్లు కక్కిరేణి శ్రీనివాస్, బైరు శైలేందర్ గౌడ్, పార్టీ నాయకులు రెబల్ శీను, లింగస్వామి, అబ్దుల్ రహీం, కుందమల్ల శేఖర్, నాగుల వాసు, సాయి, నరేందర్, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Also Read..