అధికారులు ప్రజావాణికి రాకుంటే చర్యలుః కలెక్టర్

Update: 2024-08-12 15:37 GMT

దిశా, సూర్యాపేట కలెక్టరేట్ః జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పకుండా రావాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లతతో కలిసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించడానికి వీలవుతుందని కలెక్టర్ తెలిపారు కలెక్టరేట్ లోని అన్ని శాఖల సిబ్బంది వివరాలను బయోమెట్రిక్ హాజరు లో నమోదు చేసేవిధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని,అధికారులు ఎవరైనా క్షేత్ర స్థాయి పర్యాటనలకు వెళ్ళితే కదలికల రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.మండల స్థాయి ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసే శకటాలు, స్టాల్స్ వివరాలు, స్పీచ్ కాపి కోరకు నోట్స్ సోమవారం సాయంత్రం లోపు అందజేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో జడ్పీ సి.ఈ.ఓ.అప్పారావు, డి.పి.ఓ యాదగిరి, డి.ఎం.హెచ్.ఓ. కోటాచలం, డి.ఈ.ఓ. ఆశోక్, డి.డబ్ల్యూ ఓ.నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, లత, వివిధ శాఖల అధికారులు, ఆర్జిదారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News