3 ఏళ్లుగా మండల రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న దళిత మహిళ

నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం గజలాపురం గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు కుక్క ముడి చిన్న నరసయ్య తండ్రి కాశయ్య పేరున సర్వేనెంబర్ 110లో 11 గంటల భూమి పాత పాస్ పుస్తకాలు కలిగి వంశపారపర్యంగా సంక్రమిస్తుంది.

Update: 2024-03-14 15:33 GMT

దిశ, మాడుగుల పల్లి: నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం గజలాపురం గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు కుక్క ముడి చిన్న నరసయ్య తండ్రి కాశయ్య పేరున సర్వేనెంబర్ 110లో 11 గంటల భూమి పాత పాస్ పుస్తకాలు కలిగి వంశపారపర్యంగా సంక్రమిస్తుంది. ఈ భూమి పహాని నకల్ రెవెన్యూ రికార్డులో కూడా పేరు కలిగి జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఇటీవల కుక్కమూడి నరసయ్య మరణించడంతో ఈ భూమిని అతని భార్య కుక్క ముడి చిన్న రాములమ్మ పౌతి పట్టా కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ గత 3 ఏళ్లుగా తిరుగుతున్న నేటికీ ఆమె పేరున పౌతి పట్టా చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ భూమిని ఆమె కుమార్తెకు వివాహ సమయంలో పసుపుకుంకుమలు కింద ఇస్తానని ఆమెకు రాసి ఇవ్వడం జరిగిందని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన దళిత కులానికి చెందిన వీరి భూమిని అక్రమంగా బట్టు అర్జున్ రెడ్డి తండ్రి వల్లపు రెడ్డి పట్టా చేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. దొంగ కాగితాలు సృష్టిస్తున్నాడని దీనిపై సమగ్ర విచారణ చేసి దళిత కులానికి చెంది వంశపారపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న వారి భూమిని కుక్క ముడి రాములమ్మ పేరు మీద పౌతి పట్టా చేయకుండా ఆర్ఐ రేణుక, రెవెన్యూ అధికారి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నరని అన్నారు.

తహసీల్దార్లకు తప్పుడు సమాచారం ఇస్తూ బట్టు అర్జున్ రెడ్డికి వత్తాసు పలుకుతూ వస్తున్నదని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలో ఏర్పడిన సమస్యలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని కావున వారి ఆదేశాల అనుసారంగా కుక్క ముడి చిన్న రాములమ్మ పౌతి ఇప్పించగలరని గురువారం తహసీల్దార్ పద్మకు బాధితులు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, నాయకులు వినతిపత్రం అందజేశారు.


Similar News