విదేశాల్లో రాహుల్ నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు: కేంద్ర మంత్రి బండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు.

Update: 2024-09-11 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని, విదేశాల్లో భారత ఎన్నికల వ్యవస్థను రాహుల్ విమర్శించడం దారుణమని బండి మండిపడ్డారు. అలాగే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్‌కు సాధ్యం కావడం లేదని, కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే కేసీఆర్‌ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మల్లించడానికే హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని బండి సంజయ్ ఆరోపించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేసిన బీజేపీని ఓడించడం అసాధ్యమని, బీజేపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బుధవారం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బీజేపీకి అత్యధిక సభ్యులు ఉన్నారని, తాజాగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కష్టపడి మరింత మందిని సభ్యులుగా చేర్చాలని బండి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Similar News