Aadi Srinivas: జన్వాడ రేవ్ పార్టీపై ఏం సమాధానం చెబుతావ్ కేటీఆర్.. విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

జన్వాడ ఫామ్‌ హౌస్‌ (Janwada Farm House)లో జరుగుతోన్న రేవ్ పార్టీని నార్సింగ్ పోలీసులు (Narsingi Police), సైబర్ ఎస్‌ఓటీ పోలీసులు (Cyberabad SOT Police) శనివారం రాత్రి భగ్నం చేశారు.

Update: 2024-10-27 07:56 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: జన్వాడ ఫామ్‌ హౌస్‌ (Janwada Farm House)లో జరుగుతోన్న రేవ్ పార్టీని నార్సింగ్ పోలీసులు (Narsingi Police), సైబర్ ఎస్‌ఓటీ పోలీసులు (Cyberabad SOT Police) శనివారం రాత్రి భగ్నం చేశారు. అయితే, రేవ్ పార్టీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల (Raj Pakala) ఆధ్వర్యంలో నిర్వహించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహరంపై తాజాగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) మండిపడ్డారు. డ్రగ్స్ కల్చర్‌ (Drugs Culture)కు తాను పూర్తిగా వ్యతిరేకమంటూ గతంలో కేటీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పారని ఆయన ఫైర్ అయ్యారు.

నేడు జన్వాడ ఫామ్‌హౌస్‌ (Janwada Farm House)లో జరిగిన రేవ్ పార్టీపై కేటీఆర్ (KTR) ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయన సొంత బావమరది రాజీ పాకాల (Raj Pakala) డ్రగ్స్ వ్యాపారం (Drugs Business)లో ఉన్నారంటూ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ పాకాల ఇప్పటి వరకు ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల జీవితాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు ఈ కేసులో సమగ్ర విచారణను చేపట్టి.. రేవ్ పార్టీ (Rave Party)కి హాజరైన వారందరినీ అరెస్ట్ చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.


Similar News