మూసీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన

యాదవులు రాజకీయంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనం(Sadar Sammelan)లో పాల్గొన్నారు.

Update: 2024-10-27 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాదవులు రాజకీయంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనం(Sadar Sammelan)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదవు(Yadavs)లకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యాదవులు ధర్మం వైపు నిలబడుతారని అన్నారు. ధర్మం వైపు నిలబడ్డ ఎవరూ అన్యాయానికి గురికారు అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకమైనదని అన్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్‌(Congress)ది అని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనేది కాంగ్రెస్‌ లక్ష్యమని తెలిపారు. మూసీ(Musi River)ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం.. మూసీ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మరోసారి కీలక ప్రకటన చేశారు. మూసీలో నరకాన్ని అనుభవిస్తున్న ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపుతామని సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..