Raj Pakala Rave party: రాయదుర్గం ఓరియన్ విల్లాస్‌లో పోలీసుల సోదాలు
జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాజ్ రాజ్ పాకాల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాజ్ రాజ్ పాకాల (Raj Pakala) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో కార్తీక్ అనే వ్యక్తిని ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏ2గా రాజ్ పాకాల పేరును చేర్చారు. ఈ క్రమంలోనే రాయదుర్గం (Rai Durg)లోని ఓరియన్ విల్లాస్‌లోని నెంబర్ 40 విల్లాలో నివాసం ఉంటున్న రాజ్ పాకాల ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ (Excize Enforcement Team) సోదాలు నిర్వహిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ కేసు వ్యవహారంలో మరోసారి జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎఫ్‌ఐఆర్‌లో రాజ్ పాకాల స్వయంగా ఈ పార్టీని నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు.