Congress: దీనిపై మీ స్పందన ఏంటి కేటీఆర్?.. సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్
రేవ్ పార్టీపై మీ స్పందన ఏంటి కేటీఆర్(KTRBRS)? అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రేవ్ పార్టీపై మీ స్పందన ఏంటి కేటీఆర్(KTRBRS)? అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ప్రశ్నించారు. జన్వాడ(Janwada) ఫామ్ హౌజ్ లో రేవ్ పార్టీ అని వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై సామ.. కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల(Rajpakala) ఫాంహౌస్ లో స్పెషల్ పార్టీపై సైబర్ ఎస్ఓటీ(Cyber SOT) పోలీసుల దాడులు జరిగాయని తెలిపారు. అలాగే జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని, పార్టీలో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారని చెప్పారు.
ఇందులో ఒక వ్యక్తికి కోకైన్ డ్రగ్(Cocaine Drug) పాజిటివ్ వచ్చిందని, కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్ట్ లో తేలడంతో ఎన్డీపీఎస్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారని అన్నారు. భారీ శబ్దాలతో పార్టీ నడుస్తున్న సమాచారం రావడంతో పోలీసులు తనఖీలు నిర్వహించారని తెలిపారు. మరో వైపు భారీగా ఫారిన్ లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారని, దీనిపై సెక్షన్ 34(Section 34), ఎక్సైజ్ యాక్ట్(Excise Act) కింద మరో కేసు నమోదు అయ్యిందని వివరించారు. ఇక కేటీఆర్ దీనిపై మీ స్పందన? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.