MP Raghunandan: నాకు తిక్కరేగితే అల్లు అర్జున్ కేసు నేనే వాదిస్తా.. ఎంపీ రఘునందన్ సెన్సేషనల్ కామెంట్స్
తనకు తిక్కరేగితే అల్లు అర్జున్ (Allu Arjun) తానే వాదిస్తానని ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సీరియస్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: తనకు తిక్కరేగితే అల్లు అర్జున్ (Allu Arjun) కేసును తానే వాదిస్తానని ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సీరియస్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట (Stampede) ఘటనను ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అల్లు అర్జున్ (Allu Arjun) ప్రెస్‌మీట్ పెట్టడం తప్పని పోలీసులు చెబుతున్నారని.. కేసులో కోర్టు ట్రయల్ ఉండగా సీపీ ఆనంద్ (CP CV Anand) కూడా ప్రెస్‌మీట్ పెట్టడం తప్పేనని ఆరోపించారు. సినిమా యాక్టర్ తప్పు చేస్తే ఒక రూల్.. కమిషన్ తప్పు చేస్తే మరో రూల్ ఉండొద్దు కదా అని సెటైర్లు వేశారు.
అల్లు అర్జున్ కేసును బీజేపీ (BJP) నేతలు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ (Congress) నేతల కామెంట్లపై ఆయన ఫైర్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొదటి ముద్దాయి ప్రభుత్వమేనని అన్నారు. ఇలాంటి ఘటనలను కాంగ్రెస్ (Congress) రాజకీయంగా వాడుకోవడం అందరూ చూశారని కామెంట్ చేశారు. చేతకాని కాంగ్రెస్ (Congress) పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 886 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ (Food Poison) బారిన పడితే పట్టించునే నాథుడు కరువయ్యాడని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి (Revathi) చనిపోవడం దురదృష్టకరమని.. వారి కటుంబానికి పరిహారం ఇవ్వడం అభినందనీయమే కానీ, గురుకులాల్లో జరిగిన ప్రభుత్వ హత్యల సంగతేంటని ఎంపీ రఘునందర్ రావు ప్రశ్నించారు.