Kishan Reddy : ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ ఆధునీకరణ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానం సమీపంలో నిర్మించే రైల్వే స్టేషన్(Yadagirigutta Railway Station)ను ప్రపంచ స్థాయిలో ఆధునీకరించబోతున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy)ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానం సమీపంలో నిర్మించే రైల్వే స్టేషన్(Yadagirigutta Railway Station)ను ప్రపంచ స్థాయిలో ఆధునీకరించబోతున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy)ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహాకారంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 24.5కోట్లతో యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ ను ఆధునీకరించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. తన ట్వీట్ లో యాదగిరిగుట్ట ఆధునీకరణ ప్లాన్ గ్రాఫిక్ వీడియోను జత చేశారు.
యాదగిరిగుట్ట దేవాలయంతో పోలిన నిర్మాణంతో స్టేషన్ భవన సముదాయం మోడల్ వీడియోలో ఆకట్టుకుంది. విశాలమైన రోడ్లు, గ్రీనరీ, పార్కింగ్, వసతి సదుపాయాలతో యాదగిరిగుట్ట స్టేషన్‌లో ప్రయాణికులకు, భక్తులకు అత్యున్నతమైన సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం స్టేషన్‌ను మెరుగుపరుస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.