MLC Kavitha: ఇదేనా సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్?

ఆశా వర్కర్ల(Asha Workers)పై పోలీసులు దాడి చేయడం అమానుషమని బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు.

Update: 2024-12-09 13:12 GMT
MLC Kavitha: ఇదేనా సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆశా వర్కర్ల(Asha Workers)పై పోలీసులు దాడి చేయడం అమానుషమని బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు ఆడబిడ్డలను పోలీసులతో కొట్టిస్తారా? అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మోసం చేసిందని సీరియస్ అయ్యారు.

నెలకు రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన వారిని దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్‌లలో ఎక్కించిన తీరు తెలంగాణ ఉద్యమ సమయాన్ని గుర్తుచేశాయని అన్నారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ(Sonia Gandhi) బర్త్ డే గిఫ్ట్? ఇదేనా ప్రజా పాలన అంటే? అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో, బతుకమ్మ ఆడే చేతులతోనే, ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని అన్నారు.

Tags:    

Similar News