MLC Kavitha: అలా చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి.. సర్కార్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అమలుపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉండాలని.. ఆ విషయంలో స్పష్టత ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు.

Update: 2024-12-27 07:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అమలుపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉండాలని.. ఆ విషయంలో స్పష్టత ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరిపేందుకు వీలు లేదని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కామారెడ్డి డిక్లరేషన్‌ (Kamareddy Declaration)లో చెప్పారని గుర్తు చేశారు.

బీసీల జనాభా ఎంతో తెలియకపోతే హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలే ఉన్నారని.. కానీ, 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో నేటికీ అంతుపట్టడం లేదని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు పెంచని పక్షంలో ఎన్నికలు జరగనివ్వబోమని, మండల కేంద్రాలు, జిల్లాల్లో బీఆర్ఎస్ (BRS), తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపడుతామని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. లేదా బీసీ డెడికేటెడ్ కమిషన్ (BC Dedicated Commission) నివేదిక ఇచ్చి తరువాత, బీసీ జనాభాను వెల్లడించాకే ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. అదేవిధంగా సావిత్రీబాయి ఫూలే (Savitribai Phule) జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్క్ (Indira Park) వద్ద భారీ సభను నిర్వహిస్తామని కవిత తెలిపారు.

Tags:    

Similar News