160 రోజుల విరామం తర్వాత MLC కవిత తొలి ట్వీట్.. హైలైట్‌గా నిలిచిన క్యాప్షన్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు 5 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

Update: 2024-08-29 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు 5 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఉన్నారు. అయితే.. 160 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కవిత సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. భర్త అనిల్​, సోదరుడు కేటీఆర్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీనికి ‘సత్యమేవ జయతే’ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. యాదాద్రి ఆలయం ఫొటో పేపర్‌ క్లిప్‌ను షేర్‌ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు.. KCR నిర్మించాడు’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత అక్రమ కేసులో కవితను అరెస్ట్‌ చేయడంతో దాదాపు 160 రోజుల పాటు ఎలాంటి పోస్టులు పెట్టాల్సిన పరిస్థితి రాలేదు. ప్రస్తుతం జైలు నుంచి విడుదల అయ్యాక తొలి ట్వీట్ పెట్టారు.


Similar News