ఇది ప్రజా పాలనా? రెడ్డి పాలనా..?: CM రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
‘ఇది ప్రజా పాలనా.. రెడ్డి పాలనా.. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ? అంటూ కాంగ్రెస్ పార్టీ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ‘ఇది ప్రజా పాలనా.. రెడ్డి పాలనా.. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ? అంటూ కాంగ్రెస్ పార్టీ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సప్ గ్రూపులో వాకిటి శ్రీహరి పెట్టిన మెసేజ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ మక్తల్ ఎమ్మెల్యే మెసేజ్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల ముందు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇస్తామని జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు.
కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సప్ గ్రూపులో తెలంగాణ ముఖ్యమంత్రికి విమర్శంగా మాట్లాడారు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా లేకపోవడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వచ్చే చాన్స్ ఉన్నట్లు జోరుగా చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు తనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోవడంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తిరుగుబాటు జెండా ఎగరేశారు.