జాగ ఇయ్యరు.. విమానం ఎగరనియ్యారా..? సర్కార్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్
రాష్ట్రంలో భూములు ఇస్తే 3 విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో భూములు ఇస్తే 3 విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చి ఏళ్లు గడిచాయి. రాష్ట్ర ప్రభుత్వం 1,402 ఎకరాలు కేటాయిస్తే వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు ప్రారంభమౌతాయి. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎక్స్(ట్విట్టర్) సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
జాగ ఇయ్యారు.. విమానం ఎగరనియ్యారా అని నిలదీశారు. వరంగల్ విమానాశ్రయానికి అధికార పార్టీ మోకాలడ్డుపెడుతుందని ఆరోపించారు. భూమి కేటాయించకుండా వరంగల్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కనీసం అక్కడి స్థానిక ఎమ్మెల్యేలకు సైతం పట్టింపు లేదని అన్నారు. విమానాశ్రయాలపై కేంద్రం లేఖకి సమాధానం ఇచ్చే తీరక లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి విమానాశ్రయాలు పట్ల చిత్తశుద్ధి ఇదేనా ?? ఇదేనా బంగారు తెలంగాణ ?? అంటూ ప్రశ్నించారు.