సీఎం రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్ల పర్వ కొనసాగుతుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్ల పర్వం (mountain of challenges) కొనసాగుతుంది. ఈ క్రమంలో నిన్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) విసిరిన సవాల్ పై సెటైర్లు వేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏ ప్రాజెక్టులు కట్టిందో చర్చించడానికి పిల్ల కాకులు అయిన హరీశ్ రావు, కేటీఆర్ లు కాదని.. అసలైన నేత కేసీఆర్ (KCR) రావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ (CM Revanth Reddy's challenge) విసిరారు. కాకా కేసీఆర్ కు రేవంత్ విసిరిన సవాల్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే (Huzurabad MLA) పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు! నేను ఉన్నాను కదా.. రేవంత్ రెడ్డి నీది కేవలం నా స్థాయి మాత్రమేనని అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.