బీఆర్ఎస్‌లో చేరికపై కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ MLA కాలె యాదయ్య

పార్టీ మార్పు వార్తలపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారడం

Update: 2024-07-30 14:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. తిరిగి బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నానని జరుగుతోన్న ప్రచారమంతా అవాస్తమని కొట్టిపారేశారు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరిగి గులాబీ గూటికీ చేరుతున్నట్లు జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మకండని అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి ఇవాళ మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బండ్ల బాటలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి వెళ్లిన కాలె యాదయ్య కూడా తిరిగి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్ అయిన కాలె యాదయ్య ఘర్ వాపసీ వార్తలకు క్లారిటీ ఇచ్చారు.


Similar News