Dil Raju: తెలుగు సినిమాపై సీఎం విజన్ ఏంటో చెప్పారు.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

తెలుగు సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజన్ ఏంటో చెప్పారని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు అన్నారు.

Update: 2024-12-26 07:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజన్ ఏంటో చెప్పారని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఇవాళ పలువురు సినీ ప్రముఖులతో సీఎం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలంటూ సీఎం తమకు సూచించారని తెలిపారు. హైదరాబాద్‌ (Hyderabad)లో హాలీవుడ్ (Hollywood) సినిమాల షూటింగ్స్ కూడా జరగాలని అన్నారు. అందుకు సంబంధించి సలహాలు, సూచనలను తమ నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ (Hyderabad)ను ఇంటర్నేషనల్ సినిమా హబ్‌ (International Cinema Hub)గా మర్చాలన్నదే సీఎం ఆలోచన అని తెలిపారు.

త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై ఆ అంశాలపై చర్చిస్తామని అన్నారు. డ్రగ్స్‌ (Drugs)పై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని సీఎం సూచించనట్లుగా ఆయన వెల్లడించారు. టికెట్ ధరలు (Ticker Prices), బెనిఫిట్ షో (Benefit Show)ల అంశం చాలా చిన్నదని.. ఇండస్ట్రీ అభివృద్ధే తమ ముందు ఉన్న అతిపెద్ద లక్ష్యమని అన్నారు. ఊహించిన ఘటన వల్ల ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చిందని ఎఫ్‌డీసీ చైర్మన్‌గా తాను ఈ భేటీకి చొరవ తీసుకున్నానని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై 15 రోజుల్లో పూర్తి నివేదిక అందజేస్తామని దిల్ రాజ్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News