CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువెత్తిన న్యూ ఇయర్ విషెస్
సీఎం రేవంత్ రెడ్డికి పలువురు మంత్రులు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త ఆశలతో 2025కు అందరూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) శుభాకాంక్షలు (New Year Wishes)వెల్లువెత్తాయి. ఇవాళ మంత్రులు (Ministers), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీసీసీ లీడర్లు సీఎంను కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన్ను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళా నేతలు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శుభ సంతోషాలను నింపాలని సీఎం ఆకాంక్షించారు. నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.