పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పనిచేస్తున్నాం: మంత్రి ఉత్తమ్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

Update: 2024-01-07 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల ప్రజాపాలన సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పనిచేస్తున్నామని అన్నారు. ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని గుర్తుచేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News