కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికే రేషన్ కార్డు: మంత్రి తుమ్మల క్లారిటీ

గత ప్రభుత్వం 2018లో రుణమాఫీ కోసం అమలు అవలంభించిన విధానాలనే 2024లో కూడా అమలు చేయబోతున్నామని వ్యవసాయ శాఖ

Update: 2024-07-15 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం 2018లో రుణమాఫీ కోసం అమలు అవలంభించిన విధానాలనే 2024లో కూడా అమలు చేయబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో రుణ మాఫీ క్రింద రూ.20 వేల కోట్లు ప్రకటించగా, 2023 ఎన్నికల సంవత్సరంలో బీఆర్ఎస్ సర్కార్ కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. రుణ మాఫీ పథకంలో రేషన్ కార్డ్ కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమేనని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయని, కుటుంబ నిర్ధారణ కాగానే రుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు ఆరు నెలల్లోనే ఏక కాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తుంటే హర్షించాల్సిన గత ప్రభుత్వ వ్యవసాయ, ఆర్థిక మంత్రులు, తమ ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. రైతాంగం వాళ్లని తప్పక అసహ్యించుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇది ఆయా కుటుంబాల్లో శుభ సందర్భాలుగా మారతాయని వెల్లడించారు.


Similar News