పత్తి రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Update: 2024-11-04 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఒక్కరోజే 3400 టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. 1474 మంది రైతుల నుంచి స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులంతా పత్తిని ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ చాట్ యాప్ ద్వారా దగ్గరలోని కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, అక్కడే విక్రయించి మద్దతు ధరకు పత్తిని అమ్ముకోవాలని కోరారు. రైతు సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


Similar News