మీ పాపం మేము మోయాల్సి వస్తోంది: మంత్రి శ్రీధర్ బాబు

‘మీ(బీఆర్ఎస్ ప్రభుత్వ) పాపం మేము మోయాల్సి వస్తుంది’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-07-30 15:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మీ(బీఆర్ఎస్ ప్రభుత్వ) పాపం మేము మోయాల్సి వస్తుంది’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్రామాల్లో 3 నుంచి 50 లక్షల వరకు అప్పులు చేసి చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కోరడంతో మంత్రి ఘాటుగా స్పందించారు. సభ్యులు పెండింగ్ బిల్లులపై ఆవేదనతో చెబుతున్నారని పరిశీలిస్తామన్నారు. అన్ని డిపార్టుమెంట్లకు సంబంధించిన వాటికి కూడా డబ్బులు నాడు ఇవ్వలేదన్నారు. ఒకటి తర్వాత ఒకటి బిల్లులు చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పుణ్యానికి ఇస్తామన్నారు. గ్రామీణ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేస్తామని వెల్లడించారు.

స్కిల్ యూనివర్సిటీ బిల్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంగళవారం శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతకు ఆదునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ యూనివర్సిటీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ యూనివర్సిటీ తో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక ప్రణాళికల వ్యూహాత్మక పెట్టుబడి అన్నారు.

Tags:    

Similar News