డప్పు కొట్టి స్టెప్పులేసిన పొన్నం.. మంత్రి ఆటా పాటతో దద్దరిల్లిన గోల్కొండ (వీడియో)

తెలంగాణతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆషాడ బోనాల సందడి షూరు అయ్యింది. ఇందులో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి

Update: 2024-07-07 13:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆషాడ బోనాల సందడి షూరు అయ్యింది. ఇందులో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆదివారం తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరై ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గోల్కొండ కోటలో జరిగిన బోనాల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా ఉత్సాహాంగా పాల్గొన్నారు. శివసత్తులతో కలిసి మంత్రి పొన్నం డప్పు కొడుతూ స్టెప్పులేశారు. మంత్రి డప్పు కొట్టగా శివసత్తులు కాలు కదపడంతో అరుపులతో గోల్కొండ దద్దరిల్లింది.

పొన్నం డప్పు కొడుతూ స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ‘‘డప్పు కొట్టి స్టెప్పులేసిన మంత్రి పొన్నం’’ అంటూ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే పొన్నం బోనాల వేడుకల్లోనూ అదే ఎనర్జీతో పాల్గొన్నారని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆషాడ మాసంలోని తొలి ఆదివారం కావడంతో ఇవాళ్టి నుండి మొదలైన బోనాల సందడి రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 4వ తేదీ వరకు జరగనుంది. 


Similar News