ఆర్టీసీ రక్షణ ప్రభుత్వ బాధ్యత.. మంత్రి పొన్నం హామీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, ఆ సంస్థ భూములను ఆక్రమించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

Update: 2024-02-09 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, ఆ సంస్థ భూములను ఆక్రమించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆర్టీసీ రక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అన్నారు. విశ్రాంత ఉద్యోగులను నియమించి నాలుగేళ్లుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక విప్లవం తెస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆలోచన మార్పురావాలన్నారు. ఆటోకార్మికులకు న్యాయం చేస్తామన్నారు. ఆటోకార్మికులను బీఆర్ఎస్ అవమాన పరుస్తుందని, ఇది మంచిపద్దతి కాదన్నారు.

Tags:    

Similar News