Minister Ponnam : సిద్దేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకున్న మంత్రి పొన్నం

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ సిద్దేశ్వర స్వామి(Siddeshwara Swamy)కి రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) మొక్కు చెల్లించుకున్నారు.

Update: 2024-12-26 09:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ సిద్దేశ్వర స్వామి(Siddeshwara Swamy)కి రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) మొక్కు చెల్లించుకున్నారు. ఎన్నికల్లో గెలిస్తే స్వామికి రుద్ర కవచం చేయిస్తానని మొక్కుకున్న పొన్నం ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి తన మొక్కు తీర్చుకున్నారు. సిద్దేశ్వర స్వామికి 6 కిలోల వెండితో చేసిన రుద్ర కవచాన్ని మంత్రి పొన్నం సమర్పించకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోకమంతా సుభిక్షింగా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News