Minister Ponguleti : జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్ వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ(Reorganization of districts and revenue divisions)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టతనిచ్చారు.

Update: 2024-12-17 05:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ(Reorganization of districts and revenue divisions)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టతనిచ్చారు. మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాని తీసేయాలని కాని...కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు...621 మండలాలు...76 రెవిన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లాల్లో, రెవెన్యూ డివిజన్లలో మార్పులకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కరలేదని, వాటిల్లో ఎలాంటి మార్పులు, చేర్పులను ప్రభుత్వం చేపట్టడం లేదని చెప్పారు. మక్తల్, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఆలేరు నియోజకవర్గంలో కొత్త మండలం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించమని కలెక్టర్లను ఆదేశిస్తామన్నారు.

11రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలకు సంబంధించి, నాలుగింటికి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.‘‘చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపక్ష సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మా మంత్రి, బావగారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగారని, వాటితో పాటు ఇతర సభ్యులు అడిగినన వాటిని తప్పనిసరిగా  పరిశీలిస్తామని పొంగులేటి తెాలిపారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేసిన విధానం సరిగా లేనందునా అనేక పాలనా సమస్యలు తలెత్తాయని వాటన్నింటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.

Tags:    

Similar News